calender_icon.png 4 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన సీఐ

03-11-2025 06:50:34 PM

దాతృతం చాటుకున్న మరిపెడ సిఐ రాజకుమార్..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ సీతారాంపురం పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. పోలీసులంటే కర్కాశం పోలీసులంటే కఠిన్యం. వీరికి మనసే లేదంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఇప్పటికే చాలామంది పోలీసులు నిరూపిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. అవును పోలీస్ శాఖలు అందరూ ఒకేలా ఉండరు మానవత్వం ఉన్నవాళ్లు కూడా ఉంటారు ఇదే విషయాన్ని నిరూపించారు మరిపెడ మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ తన వేతనంలో అంత మొత్తాన్ని నిరుపేద పిల్లలకు షూస్ కొనిచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.

మరిపెడ మండల కేంద్రంలో మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజకుమార్ మున్సిపాలిటీ కేంద్రం సీతారాంపురం పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద పిల్లలకు 130 మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో షూస్ తెప్పించి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి పేదలకు తన శక్తి మీద సహాయం చేయడమే తన లక్ష్యమని పేద విద్యార్థులు విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కొనసాగిస్తానని మడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ తెలిపారు.