03-11-2025 06:45:32 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఘట్ కేసర్ మున్సిపల్ ఘనపురం గ్రామ పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కొయ్యడ శ్రీనివాస్ గౌడ్ కుమారుడు కొయ్యడ అభిరామ్ గౌడ్ వైద్య విద్య ప్రవేశాలలో వరంగల్ లోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తన కార్యాలయంలో మహేష్ గౌడ్ విద్యార్థి అభిరామ్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్బంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి అభిరామ్ గౌడ్ ఎంబీబీఎస్ సీటు సాధించడం ఇందిరా నగర్ కాలనీకే కాకుండా ఘనపురం గ్రామానికి గర్వకారణమన్నారు. అతను వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి మంచి వైద్యునిగా రాణించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఇందిరా నగర్ కాలనీ వాసులు మంతెన సాయిరెడ్డి, అమిత్, విక్రమ్ పాల్గొన్నారు.