03-11-2025 07:08:21 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్షయ సంవృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదానం నిర్వహించారు. కూలీలకు, రోడ్డు మీద తిరిగే అనాధలకు కడుపునిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో చైర్మన్ ముల్లంగిరి శ్రీహరి చారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారని శ్రీహరి చారి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.