03-11-2025 07:11:33 PM
గజ్వేల్ విద్యుత్ శాఖ డిఈ భాను ప్రకాష్...
గజ్వేల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు గజ్వేల్ విద్యుత్ శాఖ డిఈ భాను ప్రకాష్ అన్నారు. గజ్వేల్ డివిజన్ కార్యాలయంతో పాటు, గజ్వేల్, ములుగు, తుక్కాపూర్ సబ్ డివిజన్ కార్యాలయాలలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ ను వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్, ములుగు,తుక్కాపూర్ ఏడీఈలు జగదీశ్ ఆర్య, శ్రీనివాస్, ఎన్. శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ఏఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.