calender_icon.png 4 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఉద్యోగులకు బహుమతుల పంపిణీ

03-11-2025 06:47:54 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే ఓసీపీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు కేకే ఓసీ ప్రాజెక్ట్ అధికారి ఎం మల్లయ్య బహుమతులు పంపిణీ చేశారు. కేకే ఓసీలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బహుమతులు అందచేసి మాట్లాడారు. కెకె ఓసి ప్రాజెక్టు అభివృద్ధి కోసం అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసిన ఉద్యోగులను ప్రోత్సహించే లక్ష్యంతో ఉద్యోగులకు బహుమతులు అంద చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇంజ నీర్ ఎన్ వెంకట వంశీధర్, మేనేజర్ కే రామరాజు, సిఎంఒఎఐ ఏరియా అధ్యక్షులు ఎస్ రమేష్, ఏఐటియుసి నాయకులు కంది శ్రీనివాస్, ప్రాజెక్ట్ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.