06-05-2025 01:30:18 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, మే 5: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం సా యంత్రం ఒక్కసారిగా భూమి కంపించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 3.8గా నమోదైంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామా రెడ్డి, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ల్లో భూప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. భూమి కంపిచడంతో ఆందోళనకు గురైన జనం ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీనంగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, ధర్మపురి, సుల్తానాబాద్, రామడు గు, చొప్పదండి, గంగాధర భూమి కంపించింది. రిక్టర్ స్కెల్‌పై 3.9గా నమోదైంది. సాయంత్రం 6.52 గంటలకు 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు పేర్కొన్నారు. కొడిమ్యాలలో ఆరు సెకన్ల పాటు, పెద్దపల్లిలో మూడు సెకన్ల పాటు కంపించింది.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండల కేంద్రాల్లో భూమి సెకన్ల పాటు కంపించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పులికుంట సమీపంలోనూ భూమి కనిపించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రత నమోదు కాగా దాదాపు మూడు సెకండ్ల పాటు భూమి కల్పించినట్లు స్థానికులు తెలిపారు.
ఇక్కడి గోలేటి గ్రామ పరి సర ప్రాంతాలను జాతీయ భూకంప కేంద్రం గా ఎన్‌సీఎస్ నిర్ధారించింది. తాజాగా పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. నిర్మల్ జిల్లాలోనూ భూ ప్రకంపలు వచ్చాయి. ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేట, లక్ష్మణ్ చందా మండలాల్లో 2 నుంచి 5 సెకన్ల పాటు కంపించింది. మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జు న్ అనే రైతు ఇల్లు కూలింది.
కామారెడ్డిలో నూ సాయంత్రం 6.50 గంటల ప్రాంతంలో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. భూప్రకంపనలపై స్పందించిన అధికారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండటం క్షేమమని పేర్కొన్నారు. కాగా ఇటీవల రామగుం డం పారిశ్రామిక ప్రాంతంలో భూమి కంపించిన విషయం తెలిసిందే.
ఆ సమయంలోనే మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో రామగుండంతో పాటు పలు సమీప ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని, ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.