06-05-2025 01:37:45 AM
తెలంగాణ జరూర్ ఆనా థీమ్‌తో ఏర్పాట్లు
రాజేంద్రనగర్, మే 5: మిస్ వరల్డ్ పోటీ ల నేపథ్యంలో వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాలభామలకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టును ముస్తాబుచేశారు.
తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్‌డెస్క్ లను ఏర్పాటు చేశారు. తెలంగాణ జరూర్ ఆనా (మస్ట్ విజిట్ తెలంగాణ) నినాదం ప్రతిచోటా కనిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.