calender_icon.png 6 May, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినరల్ మాటున దందా..?

06-05-2025 12:03:57 AM

  1. అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్లు? 
  2. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు? 
  3. మినరల్ వాటర్ పేరిట అక్రమ దందా? 
  4. ప్రజల ప్రాణాలతో చెలగాటం? 
  5. కనిపించని బీఐఎస్ ప్రమాణాలు ? 
  6. అధికారుల తనిఖీలు శూన్యం?
  7. నాణ్యతా ప్రమాణాలు పాటించని వైనం?

పల్లెల నుంచి పట్టణాల వరకు మినరల్ వాటర్ వినియోగం పెరిగిపోయింది. ప్రజలు కొని తాగేనీరు అసలీనా.. నకిలీనా అని తెలుసుకోని పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా చేసుకొని మార్కెట్లో మినరల్ వాటర్ పేరిట అక్రమ దందాకు తెరలేపారు వ్యాపారులు

వనపర్తి, మే 5 (విజయక్రాంతి): నీటి ఎద్దడి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే నీటి వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. వనపర్తి జిల్లా కేంద్రం తో పాటు మం డలం, గ్రామాల్లో కూడా  మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాల తో చెలగాటమాడుతున్నారు.

కొందరు ని ర్వాహకులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతున్నారు. 20 లీటర్లకు రూ.20 చొప్పున ఆటోలపై ఇంటింటికి తిరుగుతూ అమ్ముతున్నారు.  కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు పట్టీపట్టనట్లు వ్యవ హరిస్తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి

మినరల్ మాటున దందా

మినరల్ వాటర్ పేరుతో కొందరు వాట ర్ ప్లాంట్ల యాజమాన్యాలు నీటిని శుద్ధి చే యకుండానే క్యాన్ల లో నింపి, నీళ్ల దందా చేస్తున్నారు. నీటి నిల్వ చేసే వాటర్ ట్యాంక్ లను నెలల తరబడి శుభ్రం చేయకుండా వా డటం తో నాచు పేరుకుపోయి అధ్వాన్నంగా మారాయి. కాగా నీటిని శుద్ధి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం తేదీ వివరాలను క్యాన్ల పై స్టిక్కర్ చేయాల్సి ఉన్నా, ప్లాంట్ యాజమాన్యం ఎవరు పాటించడం లేదన్నా విమ ర్శలు ఉన్నాయి. 

ప్లాంట్ వద్ద అర్హత గల ల్యా బ్ టెక్నీషియన్ ఉండి రోజూ నీటిని పరీక్షించి కాలుష్యం, మెగ్నీషియం ఎంత మోతాదులో ఉందో పరీక్షించిన తర్వాత నీటిని సరఫరా చే యాలి. కానీ అవేమీ లేకుండా కొందరు అపరిశుభ్రమైన నల్లాల ద్వారా వచ్చే నీటిలో రు చికరమైన కెమికల్స్ కలిపి నీళ్లు సరఫరా చే స్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. 

పాటించని నిబంధనలు ..

నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్లలో బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్ అంతా స్టెయిన్ల్సె స్టీల్తో ఉండాలి. ఇ వే కాకుండా అధికారులు ప్రతీ మూడు నెలలకోసారి ఆయా ప్లాం ట్లలో నీటి నమూనా లను సేకరించి పలు రకాల పరీక్షలు నిర్వహించాలి. సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనలు ఉన్నప్పటికీ ఇవేవి అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి

నీటి శుద్ధి ఎక్కడ..? 

మినరల్ వాటర్ ప్లాంట్లు నిబంధనల ప్ర కారం పని చేస్తే ప్రతి 5 వేల లీటర్ల నీటిని శు ద్ధి చేసేందుకు 35 వేల లీటర్లు వృథా నీరు బయటకు వస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్ర కారం ఈ వృథా నీరు తిరిగి భూమిలోకి ఇం కేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్లాంట్ల నిర్వాహకులు మాత్రం మురుగు కా లువల్లోకి వదులుతున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. అందుకు వృథా నీటిని భూమిలోకి ఇంకేందుకు అక్కడే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.

ఇవి నిబంధనలు & మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే స్థానిక సంస్థలైన మున్సిపాలిటీ, గ్రా మపంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీ సుకోవాలి. ప్రతి వాటర్ ప్లాంట్ బీఐఎస్ క లిగి ఉండాలి. వాల్టా చట్టం ప్రకారం బోరుకు అనుమతులు పొందాలి.  డబ్బాలో నీళ్లు నింపే ముందు శుభ్రం చేయాలి. ఒక్కొక్క క్యాన్ను 30 నుంచి 50సార్ల కంటే ఎక్కువ వాడకూడదు.

తనిఖీలేవి? 

బోరు నీటిని ట్యాంకులోకి పంపి క్లోరినేషన్ చేయాలి. కొంత సమయం తర్వాత శాం డ్ ఫిల్టర్లో శుభ్రం చేయాలి. మినరల్స్ను జతచేసి ఓజోనైజేషన్ జరపాలి. అల్రా్ట వయో లెట్ రేడియేషన్ ద్వారా శుద్ధి చేసిన నమూనాలు తీయాలి. వాటిని మైక్రోబయోలజీ, కె మిస్ట్ ప్రయోగశాలలో పరీక్షించాలి. ఆ తర్వా త క్యాన్లలోకి నింపాలి.  ప్రమాణాలు పాటించని ప్లాంట్లపై ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954 ప్రకారంగాక్ సంబంధిత అధికారులు కేసులు నమోదు చేయాలి. మూడు నెలలకోసారి ప్లాంట్లను తనిఖీ చేసి గుర్తింపు లేని వాటిని రద్దు చేసేలా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికా రులు ఎక్కడా ఈ ప్రమాణా లను పరిశీలించిన దాఖలాలు లేవు.

ట్రేడ్ లైసెన్స్‌లు మాత్రమే ఇస్తాం

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో కేవలం రెండిటికి మాత్రమే వాటర్ బిజినెస్ పేరు మీద ట్రేడ్ లైసెన్స్ లు ఇవ్వడం జరిగింది మిగిలిన వారికీ ఎవరికీ కూడా లేవు. బీఐఎస్ నిబంధనలు గురించి మున్సిపాలిటీ కి ఎలాంటి సంబంధం లేదు.

 ఉమా మహేశ్వర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనపర్తి మున్సిపాలిటీ