04-09-2025 12:25:56 AM
పెబ్బేరు రూరల్, సెప్టెంబర్ 3 : జాతీయ రహదారి 44 పై పెబ్బేరు మండలం తోమాలపల్లె బస్టాండ్ సమీపంలో బుధవారం మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యే పైప్ లైన్ లీక్ అవడంతో నీరు వృధాగా ప్రవహించాయి. పైప్ లైన్ లీకేజీ విషయమై మిషన్ భగీరథ ఏఈ మహేశ్వరిని వివరణ కోరగా రోడ్డు నిర్మాణ పనులు జరుగు క్రమంలో మిషనరీ తాకడం వల్ల పైప్ లైన్ డామేజ్ కావడం జరిగిందని, రాత్రి లోపే లీకేజీ మరమ్మత్తులు జరిపి నీటి సరఫరా కొనసా గిస్తామని తెలిపారు.