04-09-2025 12:26:01 AM
- ఏజెన్సీ పల్లెల్లో వర్షాకాలం వచ్చిందంటే వాగుల మాయం
- అత్యవసర సేవలు కోసం జట్టి కట్టాల్సిందే
- గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన కంటే వాగులు దాటే వేదనే ఎక్కువ
- పల్లెల్లో వాగు వంకలపై వంతెన నిర్మాణాలు చేపట్టండి ఆదివాసీల అభ్యర్థనలు
- జిల్లా బాస్ సహకారంతో ఇప్పుడిప్పుడే గిరిజన ప్రాంతాల అభివృద్ధి
చర్ల, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి);సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే అటవీ ప్రాంతాల్లో జీవించే గిరి పుత్రులకు అవస్థలు మొదలైనట్టే అని చెప్పవచ్చు,ఆరోగ్యం బాగోలేక పోయిన, అత్యవసర సేవలు అందించా ల్సి వచ్చిన, ఆసుపత్రికి తరలించాలంటే గిరిజనులు ఒకరి ప్రాణం కోసం ప్రాణాలు తెగించే సాహసం చేయాల్సిందే. ఎందుకంటే వాగులు, వంకలు,చెరువులు,కాలువలు కల్వర్టులు, పొంగిపొర్లుతు వరద నీరు రహదా రికి అడ్డొస్తాయి. ప్రాణాపాయ స్థితిలో కూ డా గత్యంతరం లేక జడ్డి (మంచంలో ఉంచి ఎత్తడం) కట్టి మోసుకొచ్చే పరిస్థితి ఉంటుం ది.
వరదలతో వాగు వంకలు పొంగుతుంటే చేసేది లేక ప్రాణాలు తెగించి వాగు వంకలు దాటుతూ మరో ప్రాణాన్ని కాపాడేందుకు అటవీ గ్రామాల్లోని గిరి పుత్రులు పెద్ద సాహసమే చేస్తుంటారు వారి బంధువుల కోసం. రహదారులు సరిగా లేకపోవడం మార్గమంతా బురదమయం కావడం, జలదిగ్బంధంలో గ్రామాలు చిక్కుకోవడం, వంటి సం దర్భాలలో గత్యంతరం లేక ఇలా మోసుకొ చ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి చెర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని అనేక ప్రాంతాలలో 108 వాహనం కూడా ఆ ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితుల్లో ఇటువంటి జడ్డి కట్టి ప్రధ మంగా చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఇక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కానీ తీసుకొస్తుంటారు, రోడ్లు , కల్వర్టులు లేకపోవడం వల్ల ప్రజలు ఇప్పటికీ తీవ్ర సమస్యల ను ఎదుర్కొంటున్నారు.
చర్ల మండలంలోని పూర్తి అటవీ గ్రామాలైన బత్తెనపల్లి ,తిప్పాపు రం, బట్టి గూడెం , రామచంద్రాపురం, ఎ ర్రంపాడు,క్రాంతి పురం, వంటి అటవీ గ్రా మాలలో ప్రతి ఏటా ప్రాణాలు తెగించి వా గులు దాటే పరిస్థితి ఏర్పడుతుంది, అత్యధికంగా గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన కంటే వా గులు దాటే వేదనే ఎక్కువగా వుంటుందని ఇక్కడ ఆదివాసీలు చెప్పుకొస్తున్నారు, చర్ల మండలానికి ఆనుకొని ఉన్న ఛత్తీస్గడ్ రాష్ట్రం సరిహద్దు గ్రామాలైన పామేడు , ధర్మారం , పూజారికాకే, సుక్మా , బీజాపూర్ జిల్లా పరిధిలోని మారుమూల అటవీ గ్రామాల ప్రజ లు అత్యవసర సేవల నిమిత్తం చర్ల మీదుగా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వస్తుంటా రు, ఈ క్రమంలో కొండ కోనల నుంచి జా లువారే వరద నీటి ప్రవాహం ఏజెన్సీ గ్రా మాల కు ఆటంకంగా తయారవుతుంది, ఈ ప్రాంతా వాసులు నిత్యం కాలినడకన నడిచే పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే తీవ్ర అవస్థలు పడక తప్పడం లేదు.
ఆదివాసీల అవస్థ
బుధవారం చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ సుక్మా పరిధిలో గల ఆదివాసి గ్రామా లైనటువంటి పోలంపల్లి నుండి పాలమడ్గు-ఆరంపల్లి గ్రామాల ప్రజలు రహదారిపై ప్ర యాణించాలంటే నదులు , వాగులను దాటవలసి వస్తుంది. ఆదివాసీలు అత్యవసర పరి స్థితుల్లో ఇలా జడ్డి కట్టి పోలంపల్లి అటవీ గ్రా మం నుండి పాలమడుగు ఆరంపల్లి మధ్య గల వాగు దాటుతూ అరంపల్లి ఆసుపత్రికి ఓ గర్భిణీ స్త్రీని తీసుకొని వచ్చారు, పల్లెల్లో ర హదారి మార్గాలు సరిగా లేకపోవడం వం తెన నిర్మాణాలు జరగకపోవడం తో గ్రామస్తులు రోగులను, గర్భిణీ స్త్రీలను మంచాలపై మోసుకెళ్ళి నదిని దాటవలసి వస్తుంది.వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత భయానా కంగా మారుతుంది, ప్రజల ప్రాణాలకు ము ప్పు వాటిలో ప్రమాదం ఉంది, . ఈ ప్రాంతాలలోరోడ్లు, వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు పదే పదే డిమాండ్ చేసినా ఇప్పటికీ పరిష్కారం మార్గం దొరకడం లేదు అని పాలకులకు పట్టింపు లేదని అక్కడి గ్రామస్తులు తెలియజేస్తున్నారు.
జిల్లా పోలీసుల సహకారంతో ఇప్పుడిప్పుడే అటవీ గ్రామాల అభివృద్ధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎస్పి రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో చర్ల మండలంలోని ఏజెన్సీ అటవీ గ్రామమైన పూసగుప్ప నుంచి చతిస్గడ్ రాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది దీంతో చతిస్గడ్ తెలంగాణ రాష్ట్రాలకు బస్సు ద్వారా చర్ల మం డలానికి చేరుకునే అవకాశం కలిగింది. చర్ల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రహదారి వెంట కల్వర్టు ని ర్మాణాలు చేయడంతో కొంతమేర వరద తాకిడిని నుండి ఆదివాసి గ్రామస్తులు ఉపశమనం పొందుతున్నారు. లోతట్టు ప్రాంతాల లో మాత్రం వాగు వంకలు పొంగిపొర్లడం తో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.