27-09-2025 05:27:06 PM
నిర్మల్,(విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వారి విగ్రహానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు.
వారు స్వాతంత్ర్య ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించారని అన్నారు. పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, వందేమాతరం ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర్య కాంక్షను ముందుకు నడిపారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆబిడ్స్ పోస్టాఫీసుపై, కోఠీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారని అన్నారు. వారి ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు.