calender_icon.png 14 August, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

14-08-2025 06:41:01 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై టేకులసోమవారం, అక్కంపల్లి గ్రామాల వద్ద వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలతో రహదారిపై నిరంతరం నీరు ప్రవహించడంతో రహదారి దెబ్బతిందని ఆర్ అండ్ బి అధికారులతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలియజేయడం జరిగిందని అన్నారు. అక్కంపల్లి వద్ద ఏర్పాటుచేసిన వెంచర్ తో నీరు గత కొద్ది రోజుల నుంచి రోడ్డుపై పారుతుందని అందుకే రోడ్డు ధ్వంసమైందని అన్నారు మరో వారం రోజుల లోపు దెబ్బతిన్న రోడ్డు ప్రాంతంలో నూతన రోడ్డును ఏర్పాటు చేయించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.