calender_icon.png 14 August, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

14-08-2025 06:43:37 PM

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లోని రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలను పత్తి, వరి, మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్తవేత్తలు డాక్టర్ జి.వీరన్న, డాక్టర్ రమ్య, డాక్టర్ ప్రశాంత్ ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యల గురించి రైతులకు తెలియజేశారు. పత్తి పంటలో నీరు నిలబడి మొక్కలు వడలిపోయిన చోట కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, పాంటోమైసిన్ 1 గ్రామ్ 10 లీటరు నీటిలో కలిపి మొక్కల మొదలు దగ్గర పోయాలని చెప్పారు.

అదేవిదంగా రసం పీల్చే పురుగు ఉదృతి ఉన్నచోట ఇమిడాక్లోప్రైడ్ 2.5 మిల్లీ లీటర్లు 10 లీటరు నీటిలో కలిపి స్ప్రే చేయాలని తెలిపారు. గులాబీ రంగు పురుగు ఉదృతి గమనించటం కోసం లింగాకర్షక బట్టలు అమర్చుకోవాలని, అదేవిధంగా మొక్కజొన్నలో మువ్వు పురుగు ఉన్నచోట ఇమమెక్టిన్ బెంజోట్ 4 మిల్లీ లీటర్లు 10 లీటరు నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు. వరి పంటలో నీరు తీసివేసి 35 కిలోల యూరియా 15 కిలోల పొటాష్  వారం రోజుల్లో రెండు దఫాలుగా వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు వాసుదేవరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సురేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.