14-08-2025 06:38:36 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ(Independence Day) వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పగుచ్ఛాలు అలంకరించి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా చేపట్టాలని తూర్పాటి రాజు పిలుపునిచ్చారు.
దేశ సార్వభౌమత్వం, ఐక్యత, జాతీయ భావాల ప్రతీక మువ్వన్నెల జెండా అని, ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తిరంగా ర్యాలీ నిర్వహించడం ఆ గౌరవానికి ప్రతీకగా ఉందని ఆయన అన్నారు. హుజురాబాద్ ప్రధాన వీధుల గుండా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదవిదారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శక్తికేంద్ర ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.