calender_icon.png 26 September, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర మరవలేనిది

26-09-2025 06:30:55 PM

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర మరువలేనిదని భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పూలమాలలు సమర్పించి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఐలమ్మ చేసిన త్యాగం మరువలేదని ఆమె రగిలించిన స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ 130వ జయంతిని జరుపుకోవడం మంచి పరిణామం అని ఆయన అన్నారు.