calender_icon.png 20 May, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఎమ్మెల్యే అనిల్ పరామర్శ

20-05-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మే 19 (విజయక్రాంతి): సిరికొండ మండలం సిరిచేల్మా గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. నేరడిగొండ (జి) గ్రామానికి చెందిన ప్రజలు వివాహనికి వెళ్లి తిరిగి వస్తుండగా బులెరో వాహనం అదుపు తప్పి బోల్తాపడి, సుమారు 20 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం పరామర్శించి. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.