calender_icon.png 20 May, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు జిల్లాకు మంత్రి పొంగులేటి రాక

20-05-2025 12:00:00 AM

భీమారం (చెన్నూర్), మే 19 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం-2025లో భాగం గా జిల్లాకు 20వ తేదీన (మంగళవారం) రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారు. పర్యటన సందర్భంగా  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమ వారం భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పా టు చేసిన భూభారతి చట్టం-2025 అవగాహన కార్యక్రమ ఏర్పాట్లను మంచిర్యాల ఆర్డి ఓ శ్రీనివాస రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్ సదానందం, ప్రత్యేక తహశిల్దార్ వనజారెడ్డిలతో కలిసి పరిశీలించారు.

అనంతరం జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ ప్లాంట్ లోని హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20న ఉదయం 9.50కు జిల్లాకు చేరుకొని 10 గంటలకు భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటా రని తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు కల్పిం చాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసే దిశగా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.