01-08-2025 12:10:31 AM
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
నవాబ్ పేట్: ఆరోగ్యం బాగాలేదని అధర్యపడకూడదని ధైర్యంగా జీవించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం రాంసింగ్ తాండ గ్రామపంచాయతీకి చెందిన కేతావత్ నార్య నాయక్ 2,50,000 వేల ఎల్వోస్ చెక్కును ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందినప్పటికీ వారికి అండగా ఉండాలని సంకల్పంతో ప్రభుత్వం చేయూతను అందించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.