3 July, 2026 | 9:37 AM

హైకోర్టులో కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం

01-08-2025 12:12 AM

సీజే అపరేష్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

హైదరాబాద్, జూలై 31 (విజయ క్రాంతి): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా వచ్చిన నలుగురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురు వారం హైకోర్టులో జరిగింది. జస్టిస్ గౌస్ మీరా మొహినుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో సీజే జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ ప్రమాణం చేయించారు. పలువురు హైకోర్టు న్యా యమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.