calender_icon.png 27 September, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్

26-09-2025 08:47:45 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల కొర్ర తండాలో శుక్రవారం రూ.5 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ నాయక్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన సొంతింటి కల నెరవేర్చే అవకాశం రావడం నా అదృష్టమని వారు అన్నారు. పేద‌ల‌కు ఇండ్లు క‌డితే క‌మీష‌న్లు రావ‌న్న ఆలోచ‌న‌తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను కట్టి భారీ అవినీతికి పాల్ప‌డిందనీ వారు ఆరోపించారు. మైనంపల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు.