calender_icon.png 27 September, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి

26-09-2025 08:42:04 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): రాబోయే ఎన్నికల ప్రక్రియలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరుగుచున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... ఎన్నికలు సజావుగా జరగాలంటే పూర్తి అవగాహన ఉండాలని, శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని సందేహాలు ఉంటే  నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని, పొరపాట్లు జరుగుతే చట్టపరమైన చర్యలు  ఉంటాయని అన్నారు.