calender_icon.png 1 November, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిపిల్లలతో అక్రమ ఇసుక రవాణా

01-11-2025 08:18:49 AM

చోద్యం చూస్తున్న అధికారులు

చుంచుపల్లి,(విజయక్రాంతి): చదువుకుని ఎంతో ప్రయోజకులవాల్సిన చిన్నచిన్న పిల్లలతోటి రేయింబవళ్ళు ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్న స్మగ్లర్లు. అసలు అక్రమ ఇసుక రవాణా చేయడమే పెద్ద నేరం ప్రభుత్వ భావిస్తుంటే సహజ వనరులకు గండి కొట్టి దొడ్డిదారిన ఇసుకను దొంగిలించి ధనార్జనకు పాల్పడుతున్న వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్మగ్లర్లు పట్టపగలే ఇసుక రవాణా చేస్తున్న  పట్టించుకోని అధికారులు.బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలనే విద్యాశాఖ, సహజ వనరులను పరిరక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు నిద్రావస్థలో ఉండటంతో ఈ తంతు జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంపై కలెక్టర్  దృష్టి సారించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని. పాఠశాల విద్యార్థులను బడిలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.