28-11-2025 12:00:00 AM
ఉప్పల్, నవంబర్ 27 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మల్లాపూర్ విఎన్‌ఆర్ గార్డెన్‌లో కార్పొరేటర్ శాంతి సాయిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు నాయకుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున నినాదాలతో ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. కళాకారులతో నత్య ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జన్మది న వేడుకలు కార్యకర్తల నాయకుల ప్రజల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే జన్మదిన సందర్భం గా నాచారం కార్పొరేటర్ శాంతి గిఫ్ట్ ఏ స్త్మ్రల్ లో భాగంగా నాచారం కు చెందిన శోభన్ అనే వికలాంగునికి లక్ష పదివేల రూపాయలతో మూడు చక్రాల జుపిటర్ వాహనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదిగా ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కార్పొ రేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్ ఖాదర్ నాచారం రాఘవేంద్ర నగర్ కాలనీ పాస్టర్ శాంసన్ పాల్గొన్నారు.