విశ్వశాంతి మిషన్ మన సంస్కృతి
- విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం
- వర్తమానంలోనే ఒత్తిడి లేని జీవితం: ఆచార్య వ్రజేంద్ర బ్రహ్మచారి
- విద్యా హక్కు ప్రాథమిక మానవ హక్కు: జస్టిస్ భాస్కర్‌రావు
- ప్రాచీన సంస్కృతిని సద్వినియోగం చేసుకోవాలి
- మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి
- తాజ్‌కృష్ణలో విశ్వశాంతి మిషన్ 25వ వార్షికోత్సవం
సికింద్రాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): విశ్వశాంతి మిషన్ మన సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలిసినవేనని, అయితే ప్రపంచవ్యాప్తంగా నేడు ఎదురవుతున్న యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందని విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం అన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో విశ్వశాంతి అత్యంత ప్రాముఖ్యమై నదని, ఎంతో అత్యవసరమని అభిప్రాయపడ్డారు. విశ్వశాంతి మిషన్ వ్యవస్థాపకుడు ఆచార్య, ప్రధా న కార్యదర్శి ఆచార్య వ్రజేంద్ర బ్రహ్మచారి ఆధ్వర్యంలో తాజ్‌కృష్ణలో సోమవారం విశ్వశాంతి మిషన్ రజతోత్సవం, సన్నాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విజయక్రాంతి దినపత్రిక చైర్మ న్ సీఎల్ రాజం,
కర్ణాటక మాజీ చీఫ్ జస్టిస్ కే భాస్కర్‌రావు, తెలంగాణ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, డాక్టర్ పసిమాన్ టి సామ్యేల్, మాజీ ఐఏఎస్ రాజశేఖర్, రిటైర్డ్ కల్నల్ చంద్రశేఖర్‌రావు, మాజీ ప్రొఫెసర్ ప్రభు, సంస్కృత భారత ఆర్గనైజర్స్ లక్ష్మారెడ్డి, అశోక్‌రెడ్డి హాజరయ్యారు. పాల్గొ న్న ప్రముఖులు ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, శాంతి స్థాపనలో విద్య, నైతిక విలువల పాత్రపై సుదీర్ఘంగా చర్చించారు. విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం మాట్లాడుతూ.. విశ్వశాంతి మిషన్ మన సంస్కృతి.. సాంప్రదాయాలు అందరికీ తెలిసినవేనని, అయితే ప్రపంచవ్యాప్తంగా నేడు ఎదురవుతున్న యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ముఖ్యం గా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. అసలు సాంకేతిక పరిజ్ఞానం అమెరికాకు ఎందుకు వెళ్లిందనే విషయంపై ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచన చేయాల ని పిలుపునిచ్చారు. మన పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన జ్ఞానం, విలువలను ఎట్టి పరిస్థితు ల్లోనూ వదిలిపెట్టకూడదని స్పష్టం చేశారు. విశ్వశాంతి దిశగా అడుగులు యూనివర్సిటీల స్థాయి నుంచే మొదలుకావాలని ఆకాంక్షిం చారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ముందుకు రావాలని, ప్రస్తుత తరుణంలో శాంతి స్థాపనకు ఏం చేయాలి, ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై స్పష్టమైన ప్రణా ళికలు రూపొందించాలని సీఎల్ రాజం కోరారు.
ప్రాచీన సంస్కృతి, పురాతన జ్ఞానాన్ని సమాజానికి పంచాలి: మాజీ సీఎస్ ఎస్కే జోషి
తాను 2007వ సంవత్సరం నుంచే ఈ సంస్థ తో కలిసి పని చేస్తున్నానని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి గుర్తుచేసుకున్నారు. మన ప్రాచీన సంస్కృతి, పురాతన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని, దానిని సమాజానికి పంచగలి గితే భవిష్యత్తులో ఎలా ముందు కు వెళ్లాలో ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని అన్నారు. ’సర్వేజనా సుఖినోభవంతు’ అని మన భారతదేశం ఎప్పుడో ప్రపంచానికి చాటిచెప్పిందని గుర్తుచేశారు.
పాఠశాలల్లో కేజీ స్థాయి నుంచే నైతిక విద్యాబోధనను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ ప్రారంభమైన 2007 నాటి పరిస్థితులకు, నేటికీ ఎంతో మార్పు వచ్చిందని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, ఇలాంటి కాలంలో మనుషుల మధ్య నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనదని జోషి స్పష్టం చేశారు.
ఆత్మీయత వైపే దృష్టి: డాక్టర్ సామ్యేల్
తాము ఎప్పుడూ ఆత్మీయత వైపునకే దృష్టి పెట్టామని డాక్టర్ పసిమాన్ టీ సామ్యేల్ పేర్కొన్నారు. తాము బోధకులం మాత్రమే కాదని, ఇతరుల మా టలను కూడా ఓపికగా వినాల్సిన వారమని పేర్కొన్నారు. సమాజంలో కేవలం మానవ హక్కుల గురించే కాకుండా, సృ ష్టిలోని ప్రతి ఒక్కరి, ప్రతి ప్రాణి హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. 96 ఏళ్లగా సమాజ హితం కోసం ఇలాంటి విశ్వశాంతి కార్యక్రమాన్ని నిర్వహించడం తనకు ఎంతో సంతోషా న్ని కలిగిస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. ఆచార్య వ్రజేంద్ర బ్రహ్మచారి మాట్లాడు తూ వర్తమానంలో జీవిస్తేనే ఒత్తిడి లేని జీవితం.. మానవు నికి కేవలం శరీరమే కాదు, ముడిపడి ఉన్న మనస్సు కూడా అంతే ముఖ్యమని,
ఈ మనస్సే ఒత్తిడికి,అన్ని సమస్యలకు మూలకారణమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆచార్య పేర్కొన్నారు. గత కాలపు ఆలోచనలను వీడి, ప్ర స్తుతం (వర్తమానం)లో జీవించడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి అనేదే ఉండదని చెప్పారు. విశ్వ శాంతి మిషన్ రజతో త్సవ వేడుకల్లో ప్రపంచ ఆధ్యాత్మిక నాయకులతో సహా భారతదేశం, విదేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు.
ఈ సందర్భంగా శాంతి, ఆధ్యాత్మిక జ్ఞాన పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సుకు 2026 జూలై 28, 29 తేదీలలో హైదరా బాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సద స్సు హెన్రీ మార్టిన్ ఇనిస్టిట్యూట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్, ఇంటర్ఫెయిత్ రిలేషన్స్ అం డ్ రికన్సిలియేషన్, ఎన్పీఏ సమీపంలో, శివరాంపల్లి, హైద రాబాద్‌లో జరుగుతుందని తెలుపుతూ, తీర్మానం ఆమోదించారు. అనంతరం విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, కర్ణాట క మాజీ చీఫ్ జస్టిస్ కే భాస్కర్‌రావు, తెలంగాణ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషిను ఆచార్య వ్రజేం ద్ర బ్రహ్మచారి ఘనంగా శాలువాతో సన్మానించారు.
నైతిక, ఆత్మీయ ఎదుగుదలే నిజమైన విద్య: జస్టిస్ భాస్కర్‌రావు
విద్యా హక్కు ప్రాథమిక మానవ హక్కు అన్ని జస్టిస్ కే భాస్కర్‌రావు తెలియజేశారు. విద్యా హక్కు అనేది కేవలం చట్టం మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి ప్రాథమిక మానవ హక్కు అని ప్రముఖ విద్యావేత్త భాస్కర్‌రావు స్పష్టం చేశారు. 1989లో ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసిందని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్య అంటే కేవలం అక్షరాస్యత లేదా డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాదని,మానవ హక్కులు, క్యారెక్టర్ బిల్డింగ్ (వ్యక్తిత్వ వికాసం), మోరల్ టెక్నాలజీ, ఆధునిక విద్య, నైతిక, ఆత్మీయ ఎదుగుదలే నిజమైన విద్య అని అభివర్ణించారు. దేశ నిర్మాణంలో ఈ అంశాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా విధానాలను విశ్వవిద్యాలయాలతో (యూనివర్సిటీలు) అనుసంధానం చేస్తూ, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భాస్కర్ రావు ఆకాంక్షించారు.






