calender_icon.png 1 November, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగపేట పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం

31-10-2025 07:43:34 PM

అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని జరుపుకున్న పోలీసులు,యువకులు

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో ఉన్న పోలీసు స్టేషన్ పరిధిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకొని మంగపేట పోలీస్ లు మంగపేట కేంద్రంలో  రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాంలో సుమారు 200 మంది పాల్గొన్నారు అనంతరం ఎస్సై టీవీ సూరి మాట్లాడుతూ... భారత స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత కూడా సుమారు 565 రాజ్యాలు హైదరాబాద్ సంస్థనంతో కలిపి భారత్ లో విలీనం కాలేదు.

దేశానికి మొదటి ఉప ప్రధాని,హోం శాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వున్నారు. వీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు,ఆటక్ నుండి కటక్ వరకు వున్న చిన్న చిన్న రాజ్యలను భారతదేశంలో కలపడానికి విశేషమైన కృషి చేసారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్యం,రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే భారత యూనియన్ లో చిన్న చిన్న రాజ్యలన్నీ కలపగాలిగారు. భారత్ ను ఒక సర్వబౌమ దేశంగా ఏకికరించే మహాత్తర కార్యానికి పునుకునుని సఫలికృతమయ్యారు దేశాన్ని ఒకటిగా చేసారు. అందుకే పటేల్ గారి 150వ జయంతిని దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటున్నామని యువకులకు తెలిపారు