31-10-2025 07:47:22 PM
 
							ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమానికి చరిత్ర విభాగ అధిపతి సిహెచ్. వెంకటయ్య అధ్యక్షత వహించి వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మాలధారణ చేసి అయిన మాట్లాడుతూ... జాతీయ సమైక్యతకు వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని తెలియజేస్తూ భారత స్వాతంత్య్ర అనంతరం 560కి పైగా ఉన్న సంస్తానలను ఒప్పించి మెప్పించి (సామ,దాన, భేద, దండోపాయలు) ప్రయోగించి సమైక్య భారత దేశాన్ని సాధించారని పేర్కొన్నారు.అదే విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని(రాజ్యాన్ని) భారత యూనియన్ లొ ఆపరేషన్ పోలో(సైనిక చర్య)జరిపి 1948 సెప్టెంబర్ 17లో సమైక్య భారత దేశంలో విలీనం చేయటంలొ ముఖ్యపాత్ర వహించారని కొనియాడారు.