31-10-2025 08:00:36 PM
 
							వర్షానికి కోత గురైన రోడ్డు
పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులు
కల్వకుర్తి: గ్రామాల్లో బీటీ రోడ్లు లేకపోవడంతో మట్టిదారులు కోతలకు గురై ప్రజలు రాకపోగాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురవడంతో రోడ్డుపై నీరు పారి ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
కల్వకుర్తి మండలం ముకురాల నుండి ఎల్లికల్ వెళ్లే రోడ్డు పూర్తిగా మట్టి కొట్టుకుపోయి అర కిలోమీటర్ దూరం మేర కోత గురైంది. మూడు అడుగుల లోతు గోతి ఏర్పడడంతో రైతులు పొలాలకు వెళ్ల లేని పరిస్థితి నెలకొంది. అధికారులు పాలకులు స్పందించి రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని, ఎల్లికల్ నుండి అన్నారం వరకు తారు రోడ్డు నిర్మించాలని ఆయ గ్రామాలు ప్రజలు కోరుతున్నారు.