calender_icon.png 1 November, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ వల్లభాయ్ జయంతి వేడుకలు

31-10-2025 07:52:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా కార్యాలయం ఇంద్ర నగర్ లో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య మాట్లాడుతూ... నిజాం మెడలు వంచి, రజాకార్లను తరిమికొట్టి, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణను ఐక్యం చేసిన ధీరోద్ధాత్తుడు. భారతదేశ తొలి హోమ్ మంత్రివర్యులు, మాజీ ఉపప్రధాని, ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 వ జయంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది