31-10-2025 07:56:20 PM
 
							నిర్మల్,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు ఇందిరా గాంధీ 41వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.
దేశ సార్వభౌమత్వం కాపాడటంలో, పేదల అభ్యున్నతికి అమలు చేసిన గరీబీ హటావో పథకాలతో భారతీయ ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆమె ఆలోచనలు, నాయకత్వం ఈ తరం యువతకు స్ఫూర్తి కావాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సేవాదళం, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించారు.