23-01-2026 12:00:00 AM
ఆదిలాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అబివృద్ధి పనుల డ్రామాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తా రు. గురువారం బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం రామన్న మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
మున్సిపాలిటీలను అధిక స్థనాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.. గడపగడపకు తిరుగుతూ బాకీ కార్డుతో పాటు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గుర్తు చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్, పట్టణ అధ్యక్షులు అజయ్, యాసం నర్సింగరావు, సాజితోద్దీన్, మెట్టు ప్రలాద్, రమేష్, స్వరూప రాణి పాల్గొన్నారు.