26-09-2025 08:31:34 PM
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్లుజేఎఫ్) నూతన కమిటీకి శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు.మొన్న బుధవారం భూపాలపల్లి జిల్లా ఇల్లందు క్లబ్ లో జరిగిన టిడబ్ల్యూజెఎఫ్ 3వ మహాసభల్లో భూపాలపల్లి జిల్లా నూతన జర్నలిస్టు యూనియన్ కమిటీని ఏకగ్రీవం చేశారు.
ఈ సందర్భంగా నేడు శుక్రవారం జర్నలిస్టు కమిటీ సభ్యులు పార్టీ క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలవగా వారు కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసి జర్నలిస్టులు వాస్తవిక,అవినీతి వార్తలపై అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల కృషి చేయాలని ఆయన కోరారు.