26-09-2025 08:36:43 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): రోడ్లు నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలని నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియపరచందుకే బయలుదేరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ గానుబండకు చేరుకొని అక్కడ అభిమానులు నాయకుల గ్రామస్తుల మధ్య నిర్మించే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు తెలిపేందుకు మంత్రి ప్రయత్నించగా నాయకులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో ఆయన లోకల్ మరియు మండల నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగమైన దుర్గామాత అమ్మవారి కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో దుర్గామాత చల్లగా చూడాలని గ్రామస్తులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కల్మలచెరువు గ్రామంలో పలు రోడ్లు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ... గానుగబండ గ్రామంలో గానుగ బండ నుండి పరెడ్డిగూడెం వరకు 2 కి.మీ దురాన్ని 1.40 కోట్లతో, గానుగ బండ నుండి హనుమంతుల గూడెం వరకు 3.5 కోట్లతో 5 కి.మీ దూరాన్ని నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు అలాగే కల్మలచెరువు గ్రామంలో కల్మలచెరువు నుండి దిర్శించర్ల-చివ్వారిగుడెం వరకు 4.6 కిలోమీటర్ల దూరాన్ని 3.5 కోట్లతో నిర్మించే రోడ్డుకు, కల్మలచెరువు నుండి గానుగబండ వరకు 4 కిలోమీటర్ల దూరాన్ని 2.8 కోట్ల నిర్మించే రోడ్డుకు, కల్మల చెరువు నుండి పాలకీడు సబ్ స్టేషన్ వరకు 6 కిలోమీటర్ల దూరాన్ని 4.2 కోట్లతో నిర్మించే రోడ్డుకు, కల్మల చెరువు నుండి బోత్తలపాలెం వరకు 5కిలోమీటర్ల దూరం 3.5 కోట్లతో నిర్మించే రోడ్డుకు, సోమ్లాతండా వద్ద కల్మల చెరువు నుండి సోమ్లా తండా వరకు1.2 కి మీ దూరాన్ని 84 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.