calender_icon.png 16 November, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

15-11-2025 12:00:00 AM

పటాన్ చెరు, నవంబర్ 14 పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సం దర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.