calender_icon.png 12 December, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిర్బీ కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎంఆర్

11-12-2025 01:16:05 AM

పటాన్ చెరు, డిసెంబర్ 10 :రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిర్బీ పరిశ్రమ కార్మికులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పారామర్శించారు. గురువారం ఉదయం మొదటి షిఫ్ట్ కి బయలుదేరి వెళ్తున్న కిర్బీ పరిశ్రమ కార్మికుల బస్సుకు గిద్దలూరు సమీపంలో ప్రమాదానికి గురైంది..

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కార్మికులు చికిత్స పొందుతున్న పటాన్చెరులోని అమేధ ఆసుపత్రికి వెళ్లి కార్మికులను పరామర్శించారు. వైద్యులతో చర్చించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గాయపడిన కార్మికులందరూ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు.