calender_icon.png 12 December, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

11-12-2025 01:18:12 AM

  1. కలెక్టరేట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది అదనపు కలెక్టర్ నగేష్

మెదక్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా పరిశీలించే ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపూ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ..జిల్లాలో మొదటి విడత ఎన్నికల కోసం సర్వం సిద్ధంగా ఉందని, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరిపోయారని, పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి ఒంటిగంట వరకు జరుగుతుందని, మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.

మొదటి విడత ఎన్నికలు కోసం 312 వెబ్ కాస్టింగ్ కెమెరాతో పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. ఆరు మండలాల్లో జరిగే మొదటి దశ పోలింగ్ సరలిని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం నుండి వెబ్ క్యాస్టింగ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారని తెలియజేశారు. మొదటి విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పటిష్ట పర్యవేక్షణలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు, ఇడియం సందీప్, ఎన్నికల సిబ్బంది, తదితరులు ఉన్నారు.