11-09-2025 05:03:18 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన విశ్రాంతి ఉద్యోగుల సంఘం పాలకవర్గం, సభ్యులు గురువారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్నిఆయన శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం నూతన అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, కార్యదర్శి వీరమళ్ళ రవీందర్, కోశాధికారి చిక్కు రవీందర్, గౌరవ సలహాదారు కందుల సోమయ్య, ఉపాధ్యక్షులు పి. వెంకట్, నారాయణ, పి.ఉత్తర, సహాయ కార్యదర్శి కె. బిక్షం రెడ్డి, ప్రచార కార్యదర్శి శివకోటి ఆంజనేయులు గుప్త, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి. అంజయ్య , బాణాల రాంరెడ్డి, యం .దామోదర్ రెడ్డి, సిహెచ్. రామ్ రెడ్డి , కె.రాంరెడ్డి పాల్గొన్నారు.