23-10-2025 12:41:33 AM
భైంసా, అక్టోబర్ (విజయక్రాంతి): బైంసా డివిజన్లోని కుంటాల లోకేశ్వరం బైం స రైతుల మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బుధవారం ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో రైతుకు సోయ కొనుగోలు కూడా ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఎఫ్‌ఎసిఎస్ పిఎసిఎస్ అధికారులు పాల్గొన్నారు.