23-10-2025 12:40:18 AM
సింగరేణి ఏరియా జీఎం రాధాకృష్ణ
మందమర్రి, అక్టోబర్ 22: కోల్ బెల్ట్ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 26న బెల్లంపల్లి పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని జీఎం కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లిలోని ఎఎంసీ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ, నోబుల్ ఎంపవర్ మెంట్, వారిచే సంయుక్తంగా మెగా జాబ్ మేళా2025ను నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
ఈ జాబ్ మేళాలో దాదాపు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని కోల్ బెల్ట్ ప్రాంతాలైన మందమర్రి, బెల్లంపల్లి, పరిసర ప్రాంతాలలోని సుమారు 7వేల మంది నిరుద్యోగ యువత హాజరయ్యే విదంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఐఈడి ఎస్‌ఈ కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, గోగర్ల శోభన్ బాబు నోబెల్ ఎంపవర్మెంట్ స్టేట్ మేనేజర్ లు పాల్గొన్నారు.