27-09-2025 12:55:54 AM
టేకులపల్లి, సెప్టెంబర్ 26,(విజయక్రాంతి):టేకులపల్లి మండలంలో పలు అభి వృద్ధి పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. దాసుతండా పంచాయతీ రేగులతండా లోని బం గారు మైసమ్మ తల్లి గుడి వరకు నిర్మించే సీసీ రోడ్డు, పెట్రాంచెలక గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల అధ్యక్షులు దేవా నాయక్, పీఏసిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్, సిఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్త్స్ర శ్రీనివాస్ రెడ్డి, టేకులపల్లి ఎస్త్స్ర రాజేందర్, ఎంపీఓ గణేష్ గాంధీ, ఏఈ నవీన్, మండల నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, పోశాలు, భద్రు నాయక్, శివ, సంజయ్, మధురెడ్డి, లక్ష్మయ్య, పూల్సింగ్, తులసిరాం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.