27-09-2025 12:54:57 AM
జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 43 బృందాలచే 13 మండలాలలో దాడులు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా జలుపిస్తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 13 మండలాలలో 43 పోలీస్ బృందాలచే ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలో దాదాపు 18 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారుల పై దాడులు. దాడులలో వడ్డీ వ్యాపారాల వద్ద నుండి ప్రామిసరీ నోట్ లు, బాండ్లు, చెక్కు బుక్కులు, ఖాళీ పేపర్స్, స్టాంప్ పేపర్స్, సేల్ డేట్స్ లాంటివి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా నార్నూరు మండలంలో బంగారం కుదువ పెట్టుకొని అధిక వడ్డీకి డబ్బులను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి వద్ద నుండి 12 గ్రాముల బంగారం 235 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొన్నారు.