28-12-2025 01:11:25 AM
కుషాయిగూడ, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : డివిజన్ సాయిబాబనగర్ కాలనీ లోని సాయిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మాన్ రేగళ్ల సతీష్ రెడ్డి గురుస్వామి అధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకు గణపతి హోమం, అభిషేకం, కలషాభిషేకం, ఉరేగింపు, వుష్ఫర్పణ, మహపడిపూజ వంటి కార్యక్రమాలను పురోహితులు శివకార్తీక్, వినిత్ లు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి, మీర్పేట్ హెచ్ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు వజ్జురి పావనిరెడ్డి, కొత్త రామారావు, గొల్లూ రి అయిజయ్యలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన స్వాములకు, భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మాన్ రేగళ్ల సతీష్ రెడ్డి ఆలయ ప్రధాన కార్యదర్శి హరినాత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శేఖర్ చారి, కోషాధికారి కెఏఎన్ ప్రసాద్, నిరంజన్ దాస్ మణికంఠ నాయకులు దమ్మాయిగూడ వార్డు సభ్యులు వం డాల యాదగిరిగౌడ్, సంభన బోలు హరిగౌడ్, కనుకుల రజినీకాంత్ రెడ్డి, నవీన్ గౌడ్, శివకుమార్, శ్రీకాంత్ గౌడ్, బ్రహ్మశ్రీ శివ కార్తీక్ వినీత్ సిద్దు పంతులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.