calender_icon.png 7 September, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి, పంటనష్టంపై ముఖ్యమంత్రికి అసెంబ్లీలో వివరించిన ఎమ్మెల్యే మదన్మోహన్

02-09-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఎల్లారెడ్డి నియోజకవర్గమంతా అతలాకు తలం కావడంతో తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

ఎల్లా రెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట, లింగంపేట, రాజంపేట, మండలాల్లో ఆస్తి పంట నష్టం రోడ్లు చెరువులు ఇల్లు పోచారం ప్రాజెక్టు ప్రధాన రహదారుల వంతెనల ఇరువైపులా రోడ్డు తెగిపోవడం రాకపోకలు బంద్ కావడం వంటి విషయాలను స్పష్టంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మో హన్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రికి నేరుగా భారీగా కురి సిన వర్షాల పట్ల నష్టపోయిన ఆస్తి నష్టం పట్ల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మదన్మోహన్ తెలియపరచారు.

సంబంధిత శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రెటరీల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి విషయాలను ముఖ్యమంత్రికి తెలియపరిచారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ భారీగా తులసిన వర్షానికి వరదలు తడిసి ముద్దయిందని ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైనా ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మదన్మోహన్ వినతి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించి పూర్తి నివేదికను అధికారులు అందించినట్లయితే చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందిం చినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు.