20-09-2025 12:25:31 AM
నాగారం: నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లా గ్రామానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో నాగారం బంగ్లా గ్రామానికి ఐమాక్స్ మంజూరు చేయడంతో నాగారం బంగ్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఐమాక్స్ లైట్స్ ను బంగ్లా చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొని రెడ్డి మోహన్ రెడ్డి, బయ్యం వెంకన్న ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగ్లా గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.