20-09-2025 12:26:25 AM
పాపన్నపేట, సెప్టెంబర్ 19 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ వా రం రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు వదలడంతో ఆల యం చెంత గంగమ్మ ఉధృతి పెరిగింది. దీంతో వనదుర్గమ్మ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం చెంత ఉన్న ఏడు నదీ పా యలు పరవళ్లు తొక్కుతున్నాయి. సింగూరు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది.
ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయానికి రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి రాజ గోపురంలో వనదు ర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యథావిథిగా పునః ప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు.