calender_icon.png 12 January, 2026 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకతీతంగా పనిచేద్దాం.. గ్రామాన్ని ప్రగతిపథంలో నిలబెడదాం

12-01-2026 12:00:00 AM

మున్ననూర్ గ్రామాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం...

గ్రామంలో పాఠశాల అభివృద్ధికి రూ. కోటి మంజూరికి హామీ

మార్నింగ్‌వాక్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, జనవరి 11 (విజయక్రాంతి): గ్రామాల్లో ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా పనిచేస్తే గ్రామం త్వరితగతిన సర్వతోముఖా భివృద్ధి సాధిస్తుందని ఇటీవల గ్రామాలలో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులందరూ ఓటు వేసిన వేయకుండా గ్రామస్తు లందరూ మనవారేనని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడా లని వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామంలో నిర్వహించిన మార్నింగ్ వాక్ లో ఆయన  అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలోని వీధుల గుండా పర్యటించి గ్రామ ప్రజలతో మాట్లాడి పలు సమస్యలను అక్కడే అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేయాలంటూ సూచించారు.   

గ్రామాలలో నెలకొనే సమస్యలన్నీ తనకు తెలుసునని గ్రామ సర్పంచ్ పదవి దగ్గర నుంచి ఎంపీటీసీ ఎంపీపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన సొంత గ్రామం మంగంపల్లిలో పూర్తి అభివృద్ధి సాధించామని తన సొంత గ్రామం లాగానే మున్ననూరు గ్రామాన్ని సైతం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేలా తను కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. మున్ననూర్ గ్రామ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ సర్పంచ్ మమత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప,  గోపాల్పేట ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్య శీలా రెడ్డి, మండల మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సత్యం, గ్రామ అధ్యక్షుడు ధీర మల్లు, యూత్ అధ్యక్షులు శశికుమార్, గ్రామ పెద్దలు గ్రామస్తులు గ్రామ మహిళలు యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లలో వనపర్తి పట్టణాభివృద్ధికి రూ. 897 కోట్ల్లు మంజూరు..

కేవలం రెండు సంవత్సరాల లోనే వనపర్తి పట్టణ అభివృద్ధికై రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ రూ. 807 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. ఇటీవల పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రెండు కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఇందుకు సంబంధించి పట్టణంలో అధునాతన వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి 60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం వీధిదీపాలు ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

దినదిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణాన్ని రాష్ట్రంలోనే  గుర్తింపు పొందేలా చేయడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీకి సైతం ఒక రూ.కోటి 23 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఇందులో 20 లక్షల రూపాయలను వీధి దీపాల ఏర్పాటుకు కేటాయించి నేడు వీధిదీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డిఈ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ భాస్కర్, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళి

వనపర్తి, జనవరి 11 ( విజయక్రాంతి ) : స్వాతంత్ర సమరయోధుడు తెల్ల విప్లవాన్ని ప్రారంభించి హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన నిరాడంబరడైన నాయకుడు లాల్ బహుదూర్ శాస్త్రి అని వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా వనపర్తి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లాల్ బహుదూర్ శాస్త్రి  చిత్రపటానికి ఎమ్మె ల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నిరాబరుడైన లాల్ బహుదూర్ శాస్త్రి  స్వాతంత్య్ర ఉద్యమంలో చేరి, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని ఎన్నో మార్లు జైలు శిక్షను అనుభవించారని ఎమ్మె ల్యే గుర్తు చేశారు.

ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో జై జవాన్ జై కిసాన్ అనే నినా దంతో ఇటు రైతుల్లో అడ్డు సైన్యంలోనూ పూర్తి మించిన వ్యక్తి మనకందరికీ ఆదర్శ అవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్ర మంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా  దిశా కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, తిరుపత య్య గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.