16-08-2024 07:31:56 PM
రాజన్న సిరిసిల్ల: ఓ ఆటోమొబైల్ యజమాని అప్పులు బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... పట్టణానికి చెందిన భాను(40) అనే వ్యక్తి కొత్తచెరువు ప్రాంతంలో ఆటోమొబైల్ నడిపిస్తున్నాడు. వ్యాపారానికై తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో మానసికంగా వేదన చెందిన భాను శుక్రవారం తన ఆటోమొబైల్ షాప్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.