25-10-2025 12:00:00 AM
మెదక్, అక్టోబర్ 24 : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అదే సమయంలో ఆవైపు నుండి వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్పందించి తన కాన్వాయ్ను ఆపి గాయపడిన మహిళకు నీరు తాగించి, తన వ్యక్తిగత కారులో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే స్పందించిన తీరుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.