calender_icon.png 25 October, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవభక్తి సన్మార్గంలో నడిపిస్తుంది

25-10-2025 12:00:00 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

దేవరకద్ర, అక్టోబర్ 24: దైవభక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని హాజీలాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలోఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలను చేశారు. ఈ సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో జీవనం గడపాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.