calender_icon.png 13 May, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసిహెచ్ఎస్ రవిబాబుని అభినందించిన ఎమ్మెల్యే సాంబశివరావు

21-04-2025 11:51:58 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిహెచ్ఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రవిబాబు కు  ఇటీవల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ఇటీవల వచ్చింది. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి నందు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు డాక్టర్ రవిబాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పేద ప్రజలకు మరింత కార్పొరేట్ సాయి వైద్యం అందినందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ కే. సుజాత, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ సోమరాజు దొర, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, సీపీఐ నాయకులు ఉప్పుశెట్టి రాహుల్,  అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, మనేం వెంకన్న, నరహరి నాగేశ్వరరావు, బానోత్ రంజిత్, రవి, కాంగ్రెస్ నాయకులు కుమార్ రాజు విజయ్, సుమ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.