calender_icon.png 11 January, 2026 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..

05-01-2026 12:03:57 AM

  1. చందానగర్ గ్రామ సర్పంచ్ తోక మురళికృష్ణ 

సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించిన గ్రామ రేషన్ డీలర్ కట్ట ప్రభావతి 

మొయినాబాద్, జనవరి 4 (విజయ క్రాంతి): అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని, గ్రామ సర్పంచ్ తోక మురళికృష్ణ పేర్కొన్నారు. ఇటీవల గ్రామపంచాయతీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ రేషన్ డీలర్ ఘనంగా సన్మానించారు. ఆదివారం మొయినాబాద్ మండల పరిధిలోని చందానగర్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ రేషన్ డీలర్ కట్ట ప్రభావతి గ్రామపంచాయతీ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు శాలువులతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రేషన్ డీలర్ కట్ట ప్రభావతి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని, తమకు రావలసిన కమిషన్, బకాయిలు, గౌరవ వేతనం, పెంచాలని, సర్పంచ్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. సానుకూలంగా సంధించిన గ్రామ సర్పంచ్ తోక మురళికృష్ణ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో రేషన్ డీలర్ల పాత్ర ఎంతో కీలకమని అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిద్దుతాన్నని, తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కుమ్మరి రాజు, వార్డు సభ్యులు వీరేష్, చాకలి వసంత నవీన్, కుమ్మరి భాస్కర్, కిస్టాపురం మహేందర్, పగడాల ఉషా ప్రభాకర్, ఎండీ. రైసా హాసన్, పూజారి వరలక్ష్మీ రాజు, గ్రామ మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.